Sunday, June 27, 2010
టివి చరిత్ర
టివి చరిత్ర
ఏ టివి చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం
టివి చరిత్ర సమస్తం సమాజ పీడన పరాయణత్వం
టివి చరిత్ర సమస్తం పరస్పరారొపణొద్యొగం
టివి జాతి చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాహసిక్తం
భీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం
టివి జాతి సమస్తం దరిద్ర్రుల కాల్చుకుతినడం
మీడియా యజమానులు దుర్బల వీక్షక జతిని
టివి బానిసల కవించి మనొవైక్ల్యన్ని సృష్టించి
కల్లబొల్లి మాటలతొ ధరాధిపతులంతటివరై
చరిత్రను చంకనాకించి ప్రసిద్దికెక్కరు
టివి మాయ జాదంలొ ఓడని మనిషి
భూస్థతమంత వెదకిన దొరకదు.
ప్రతీ సుభొదయం నీకు తడిసే రక్తమున
కాకుంటే కన్నిళ్ళతొ సుస్వాగతం
చేల్లచెదుర్రెన సంసారాలు, మరణించిన జనసందొహం
అసహయుల హహకారాలు
వీరికి పంచభక్షపరవాణ్ణలు
వైషమ్యం, స్వార్దపరత్వం, కౌటిల్యం, ఈర్ష, స్పర్ధలు
మాయలతొ, రంకుతనంతొ, మారుపేర్లతొ
టివి గమనగతులను నిరూపించినది.
రవిప్రకాష్, రామొజీ, రాధాకృష్ణ,మురళికృష్ణ
జగన్, నరేంద్ర ఎవడైతేనేం
ఒక్కొక్కడు సమాజకంటకుడు.
నాయుడు, రెడ్డి, కమ్మ, కపు, మాల, మాదిగ, భ్రాహ్మణులు
కట్టిరి కాలానికి కత్తుల వంతెన.
అగ్యానపుటంధకార యుగంలొ, ఆకలితొ, తీవ్రశక్తులు
నడిపిస్తే నడుస్తున్న ఆ-మానుషులు
చిరకాలం జరగిన మోసం, బలవంతుల ధౌర్జన్యం
దుర్మర్గపు ధనవంతుల అబ్దపుటావేశ పన్నాగాలు
ఇంకానా! ఇంకెన్నాళ్ళు?
ఒక వ్యవస్థ మరొక వ్యవస్థను,
ఒక జాతి మరొక జతిని
పీడించే సాంఘిక ధర్మం.
ఇంకానా! ఇంకెన్నాళ్ళు?
వెంకటగిరి చేనేత కార్మికుడు, ఫిలిమ్ సిటి లైట్ బాయ్,
ప్రైవెటు యజమాని నెలసరి గుమస్థా, వేశ్య కర్షకురాలు,
రక్కసివేళల చలిమర కర్మచారులు, సెక్సు-డ్రగ్సు మత్తున మునిగిన యువత. ఇలా
అణగారిన ఆర్తు లెందరొ.
హిందు, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, జైన, భౌధ్ధ, మత
చారిత్రక యదార్ధలకు సమాధి కట్టి
వాటిపై స్వార్ధ ప్రయొజన పుష్పమాలలు వారివి
ముళ్ళకిరీట ధారణ మనది.
ఏ ఉద్యమం ఎందుకు జరిగెనొ?
ఏ ప్రభుత్వం ఎన్నాళ్ళొ?
కొన్నికుటుంబాలు, నీతిమాలిన నేతలు
ఇది కాదొయ్ వార్తా-మానానికర్ధం.
ఈ స్వామి రంకు పురణం
ఆ పార్టి గుణాలు, ఈ పార్టి గణనలు
మతలబులు, సొంత ఢాంబికాలు
ఇవి కావొయ్ పత్రికా స్వాతంత్ర సారాంశం.
ఇతిహసపు వక్రీకరణం, కనిష్ఠ విలువల కల్పిత కథలతొ
సత్యనికే సంకుచితం కలిగే అసత్యలు
రాయల నాగరికతలొ సామాన్యుని జీవనమెట్టిది?
ప్రభుత్వ నిర్మణానికి ఎలుగెత్తిన కార్యకర్తలెవ్వరు??
ముఠాల తగువులలొ సామాన్యుల శొకం యెట్టిది?
తెరక్కిన నాయకుడు కాదొయ్ దివిటి పట్టిన దరిద్రులెవ్వరొ?
తెలంగాణా, రాయలసీమ, హైదరబాదు, క్రిష్ణ, శ్రీకాకుళం,
నైజాం, అనంతపురం, కడప, కొనసీమ ల
ధనిక మదపుటెనుగుల
పారంపర్య కుటుంబ కక్షా సంధ్యలలొ
వన్య మానవ మానసిక వికాశమెట్టిది?
ఈ సమజం ఏ కాలంలొ సాధించినదీ పరమార్ధం???
ఏ టివి ? ఏ అస్త వక్త వ్యవస్థ ??
ఏ పార్టీ ??? ఏ ప్రభుత్వం ????
ఏ వెల్గులకీ ప్రస్థనం
ఏ వెల్గులకీ ప్రస్థనం
ఏ సమజం ??????? ఏ దిగ్విజయం
ఏ వెల్గులకీ ప్రస్థనం
ఏ వెల్గులకీ ప్రస్థనం
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
రమేశ్,
చాలా బావుంది, తెలుగులో టైపింగ్ తప్పులు లేకుండా మరోసారి పబ్లిష్ చెయ్యండి. గుడ్
Post a Comment