Saturday, December 24, 2011

రౌడి మీడియా రిపోర్టర్ " సెట్ట్లేమెంట్ " (Roudi Media Reporter Settlement)

రౌడి  మీడియా  రిపోర్టర్  సెట్ట్లేమెంట్ 


మాది ఈ గ్రేటర్ విశాఖపట్నం లో ఒక మాజీ పంచాయతి ఐన వెంకటాపురం గ్రామం ఇది అసలు సిటీకి ఒక 3 KM  దూరంగా ఉంది దీనిలో మాది ఒక కొత్త Flat . మా Flat  నుండి Road  కి వెళ్ళాలంటే Auto మాకు Public వాహనం .

ఈ వెంకటాపురం గ్రామం పక్కనే యున్న మరొక గ్రామం పద్మనాభపురం వాళ్లకి దారి ఈ వెంకటాపురం మీదనుంచి అందుకని ఆ ఊరి లో కొంతమంది ఈ ఊరి లో కొంతమంది కలిపి అందరు ఒక ఆటో Union గా మారి ఉరిలో ఒక ఆటో స్టాండ్ ,  మెయిన్ రోడ్ బస్సు పాయింట్ దగ్గర ఒక ఆటో స్టాండ్ పెట్టి ఊరిలో వారికీ అప్  & డౌన్ సర్వీసులు ఇస్తునారు . 

ఆటో సర్వీసెస్ రెట్లు , ఇతర ఆటో సంభందిత అన్ని గొడవలను ఈ Union  తీరుస్తున్నది . Union  మాట Final . 

ఈ రోడ్ నుంచి ఊరిలోకి , ఊరిలోంచి రోడ్ కి ఉన్న దారిలో ఈ స్టాండ్ లో ఉన్న బళ్ళు మాత్రమే నడపాలి . ఈ దారి కాకుండా వ్యక్తీ పరంగా ఇంకయక్కడైన ఆటో నడుపుకోవచ్చు . 

ఇలా ఉంటుండగా union లోని ఒక ఆటో వేరొక చోట అనగా వెంకటాపురంకి ఒక 15 KM దూరంలో పెందుర్తి అనే చోట ఆటో నడుపుతూఉండగా ఒక swift car తో ఆక్సిడెంట్ ఇంది ఆ  swift car  నడిపే వాడిదే తప్పు అని తేలింది . 
ఈ ఆటో డ్రైవర్ Union వాళ్ళను వెంట పట్టుకొని వెళ్లి ఆ ఊరి వాళ్లతో మాటలు ముగించి ఆటో కి Compensation క్రింద 5000 రూపాయలకు కి Union  సమక్షంలో  ఒప్పందం కుదుర్చుకొన్నారు. 

ఇప్పటి వరకు పద్ధతిగా నడచింది వ్యవహారం ఇలా పద్దతిగా నడిస్తే మన ఆటో డ్రైవర్ కి ""కిక్క్ "" లేకో  (లేదా )  ఇదే మనకి అనువూ ఐన సమయం అనో ఇదే మనం డబ్బ్లు చసుకోవలసిన సమయం అనో ఒక మీడియా రిపోర్టర్ డబ్బులు దొబ్బె పోర్టర్ లాగా మధ్యలోకి వచ్చాడు . తరువాతి ఉదయమే ఆటో డ్రైవర్ ని వెంట పెట్టుకొని వెళ్లి ఆ కార్ డ్రైవర్ తో ఏ రకంగా మాటలుఆడాడో  ఏమొ  Compensation  మొత్తాన్ని 8000 రూపాయలకు పెంచి అప్పుడే ఆ మొత్తాన్ని తెచ్చుకొన్నారు . 

ఇలా వీళ్ళిద్దరూ కలసి చసిన వెధవ పని Union కి తెలిసి . Union  ఒక ఒప్పందం ప్రకారంగా Union  సమక్షంలో జరిగిన నిర్ణయాన్ని తోసిపుచ్చడమే కాకుండా Union  ని అగౌరవంపరచి నందుకుగా ఆటో డ్రైవర్ కి ఒక 1000 రూపాయలు జరిమానా విధించిది  Union . 

జరిమానా అంటే చసిన తప్పు కి ఒక నిష్కృతి ( లేదా ) చసిన తప్పు తేలిసిరావడానికి మరల అదే చేయాకుండా ఒక దండన అని భావిస్తే మంచిదే . 

కానీ మన బండ ఆటో డ్రైవర్ Union మీద కోపం పెంచుకొని  Union  కి జరిమానా కట్టకుండా Union రోడ్ పాయింట్కి కొంచం ముందున్న బస్సు స్టాప్ లో కొంతమంది ప్రయాణీకులను ఎక్కించుకొని Union వాళ్ళే నడపాలి అని నిర్ణయించుకున్న దారిలో వస్తుండగా Union వాళ్ళు సదరు బండ బాబుని పట్టుకొని ఏమిటయ్య ఈ ప్రవర్తన అని కొంచం గట్టిగా అడుగుతుండగా Union కి బండ డ్రైవర్ బాబు కి వాగ్వివాదం రేగింది ఇక్కడి వరకు నాకు ఈ రోజు తేలిసింది . 

ఈ  కథ లోని అసలు దుండగుడు , వెధవ , కారణ "భూతం" ఐన మీడియా రిపోర్టర్ గారు మొత్తం కథలో మహాఇతే రెండు లేదా మూడు లైన్లు కథ నడిపి , ఒక రెండు మూడు గంటలు సమయం వేచ్చి౦చ్చి  , ఒక రెండు నుంచి రెండున్నర వేల రూపాయలు స్వాహా చేసారు ఇది అంతా వారి మీడియా రిపోర్టర్ గిరితో సాధ్యపడింది .

మీడియా రిపోర్టర్ గిరి చాల పవిత్రం ఐనది . 

దానిని కాస్తా ఇలా డబ్బుకి దాసోహంగా మార్చి , వెధవ పనులను క్రొత్తగా క్రొంగొత్తగా కనిపెట్టిమరీ రౌడిలలాగా సెట్ట్లేమేంట్లు చస్తున్నారు నేటి  మీడియా రిపోర్టర్ గార్లు .......బూర్లు....బో____లు .....

ఇది ఒక 2000 మంది కన్నా తక్కువున్న చిన్న ఊరిలోని రిపోర్టర్ నిర్వాకం . మరి పెద్ద పెద్ద మీడియా తిమి౦గళలు ఏమి మేస్తున్నాయో యెంత మేస్తున్నాయో మీరే ఆలోచించండి ............................




ఎక్కువ ఆలోచించకండి అవి మీ మా సామాన్య ,  అమాయకపు ఆలోచనలకు అందని ఎత్తులు.....చెత్తలు ..........

No comments: